Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్‌బుక్ ఫాలోవ‌ర్ల‌లో కాజ‌ల్ రికార్డు.. 24 మిలియ‌న్ల‌కు చేరుకున్న అభిమానులు

  • ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ద‌క్షిణాది న‌టి
  • కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన న‌టి
  • 'క్వీన్' సినిమా రీమేక్‌లో న‌టిస్తున్న కాజ‌ల్‌
ఈ కాలం న‌టీమ‌ణుల్లో చిరంజీవితో క‌లిసి న‌టించిన ఘ‌న‌త కాజ‌ల్‌కే ద‌క్కుతుంది. ఓ ప‌క్క పెద్ద‌హీరోల‌తో, మ‌రో ప‌క్క  చిన్న‌హీరోల‌తో క‌లిసి న‌టించిన కాజ‌ల్‌ ఫేస్‌బుక్ ఫాలోవ‌ర్లలో స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఫేస్‌బుక్‌లో ఆమె పేజీని 24 మిలియ‌న్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి ద‌క్షిణాది న‌టి కాజ‌ల్‌.

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం చిత్రాల్లో కూడా కాజ‌ల్ న‌టిస్తుండ‌టం కూడా ఇందుకు ఒక కార‌ణం. అంతేకాకుండా త‌న షూటింగ్‌లు, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను, ఫొటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటుంది. సోష‌ల్ మీడియాలో క్రియాశీల‌కంగా ఉండ‌టం కూడా ఫాలోవ‌ర్ల సంఖ్య పెర‌గడానికి తోడ్ప‌డింది.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ ఫొటో షేర్ చేసి అభిమానుల‌కు కాజ‌ల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ప్ర‌స్తుతం క‌ల్యాణ్‌రామ్ స‌ర‌స‌న 'ఎంఎల్ఏ (మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి)', 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్‌'లోనూ కాజ‌ల్ న‌టిస్తోంది.
Kajal Agarwal
facebook
followers

More Telugu News